గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో గాయపడిప సీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో ఈ దాడి చేశారని ఆరోపించారు. కరెంట్ తీసి రాళ్లతో ఊరేగింపుపై దాడికి వైసీపీ గుండాలు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఇక, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Read Also: Venu Thottempudi: టాలీవుడ్ హీరో వేణు ఇంట్లో విషాదం!
ఇక, పల్నాడు జిల్లా తొండపి గ్రామంలో జరిగిన ఘర్షణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. రాజకీయ పార్టీలు ఏవైనా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మంచి పద్దతి కాదన్నారు. నేను దాడి చేపించానాని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడంపై మంత్రి అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను దాడులు చేయించే రకం కాదు.. ప్రజాస్వామ్యంలో అందరూ సామరస్యంగా ఉండాలని కోరుకుంటానని ఆయన అన్నారు. సకాలంలో పోలీసులు స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదని మంత్రి అంబటి అన్నారు.