కొన్ని సినిమాలు, సీరియల్లలో దేవుళ్లని, అలాగే దయ్యాలని మనం చూస్తూ ఉంటాం.. అవి కేవలం సినిమాల్లో మాత్రమే కాదు మన నిజ జీవితంలో కూడా దేవుడు, దయ్యాలు ఉన్నాయని చాలా మంది ప్రజలు నమ్మతుంటారు. అలాగే, చిన్న చిన్న గ్రామాల్లో మనిషిలో దేవుడు పూనాడు.. దయ్యం పట్టిందని ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు దేవుడు, దయ్యాన్ని ఎవరూ కూడా ప్రత్యక్షంగా చూడలేదు.. అయితే, వేదమంత్రాలు నేర్చుకున్న పూజారులు, పండితులు దేవుళ్లని ఆరాధిస్తారు.. కానీ, క్షుద్రపూజలు నేర్చుకున్న మాంత్రికులు దెయ్యాలను కొలుస్తారు.. అయితే, ఎవరిపైన పగ సాధించాలంటే వారిపై క్షుద్రపూజలు చేసి వారినిక నాశనం చేయాలని చూస్తుంటారు. అలాంటి వాటిని చూస్తే ప్రజల భయంతో జంకుతారు.
Read Also: Ayodhya Ram Mandir: 2500 ఏళ్లలో ఒకసారి వచ్చే భారీ భూకంపాన్ని రామ మందిరం తట్టుకుంటుంది..
తాజాగా, కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. కాండ్రకోట గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండు మిర్చిలతో పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు హడలిపోతున్నారు. రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్థులు భయ పడుతున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇళ్ల ముందుకు క్షుద్ర పూజలు చేసినట్లు వాపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయంగా ఉందంటున్నారు. దీంతో కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తున్నారు.