బియ్యం ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇవాళ (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రారంభించనట్లు కేంద్రం ప్రకటించింది. కిలో బియ్యాన్ని కేవలం 29 రూపాయలకే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఆరంభించనున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలోకి అడుగులు వెస్తు్ంది. నేడు సుందర్‌గఢ్ జిల్లా నుంచి రాహుల్ గాంధీ ఒడిశాలోకి అడుగు పెట్టనున్నారు.
దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన చీకటి రోజుగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
పన్నుల బదలాయింపు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అన్నారు.
ఇవాళ రాష్ట్రపతి హోదాలో మాల్దీవుల అధ్యక్షుడు ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మహ్మద్ ముయిజ్జూ మాట్లాడుతూ..తాన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని అనుమతించేది లేదని తెలిపారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెట్టనున్నారు.
తమిళనాడు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతుంది. దీంతో కాంగ్రెస్ మాజీ హోంమంత్రి, పి.చిదంబరం కుమారుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా ఉద్యమిస్తున్నారు.
అంతర్జాతీయ సంగీత వేదికపై ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ జయకేతనం ఎగరవేశారు. వీరు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా అవార్డ్ ను సొంతం చేసుకుంది.