భారత్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో మాల్దీవుల్లో కూడా రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. దేశంలోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు - మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, డెమొక్రాట్స్ పార్టీలు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంపై భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రష్యా ఆధీనంలోని లిసిచాన్స్క్ సిటీలోని బేకరీపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యన్ అధికారులు తెలిపారు.
గోబీ మంచురియా డిష్ పై గోవాలో భారీ గొడవలు జరుగుతున్నాయి. గోబీని అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేయడం వల్ల ఈ డిష్‌లో ప్రమాదకర కలర్స్ వాడటంతో పాటు దుస్తులు ఉతకడానికి ఉపయోగించే పౌడర్‌ను సాస్ తయారీలో ఉపయోగించడంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- హమాస్ దేశాల మధ్య యుద్ధం బీభత్సంగా కొనసాగుతుంది. ఈ యుద్ధంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం వల్ల సదరు దేశాలపై ఆర్థిక భారం పెరుగిపోతుంది.
జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో బస చేశారు. ఇక, చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో పది మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది.
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల నిఘా సంస్థ కెనేడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంచలన ఆరోపణలు చేసింది. భారత్‌తో ముప్పు పొంచి ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానికి (96) ఇవ్వనున్నట్లు ప్రకటించింది.