ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ పట్టు బిగిస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిన 5 సమన్లపై ఆప్ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు.. దీంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవను కనుగొన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. వారంతా తమిళనాడులోని కన్యాకుమారి వాసులని పోలీసులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేయనున్నారు. కేంద్రం పన్నులను బదిలీ చేయడం లేదని.. రాష్ట్రానికి ఆర్థిక సహాయం కూడా చేయడం లేదని వారు ఆరోపించారు.
ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు మణిపూర్‌కు చెందిన వివిధ గిరిజన సంస్థల ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో పాటు హోం మంత్రిత్వ శాఖ అధికారులను కలవనున్నారు.
ఎన్నికల కమిషనర్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయడంతో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో ఒక స్థానం ఖాళీ కానుంది.
ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను జత చేసింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా న్యాయస్థానం స్వీకరించి విచారణ చేస్తుంది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయాలు హీటెక్కాయి. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ డాక్టర్ సయ్యద్ తుఫైల్ హసన్ (ఎస్టీ హసన్) సంచలన కామెంట్స్ చేశాడు. యూసీసీ బిల్లు ఖురాన్‌కు విరుద్ధమైతే వ్యతిరేకిస్తాం..
జిటల్ చెల్లింపులలో ఓ వెలుగు వెలిగిన పేటిఏం సంస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొనసాగుతోంది. అయితే, ఫెమా నిబంధనల ప్రకారం కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను కలిశారని తెలుస్తుంది.