ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదరిని రేప్ చేసి హత్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రపంచం మొత్తానికి భారతదేశం అవసరం ఉంది.. దానికి అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే ఈ ప్రపంచం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పని చేస్తున్న పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తుంది. సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
2024వ సంవత్సరంలో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్. ఫ్లై (Layoffs.fyi) డేటాలో వెల్లడించింది.
బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఉమ్మడి పౌర స్మృతి( యూసీసీ ) బిల్లును ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇటీవల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన వర్గానికి (OBC) చెందిన వ్యక్తి.. ఆయన చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం వల్లే శంకరాచార్యులు రాలేదని తమిళనాడు క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.
నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘ఇండియా ఎనర్జీ వీక్ 2024’ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.