Pakistan Violence: దాయాది పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ) అనే మతతత్వ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీతో పాక్ సర్కార్ అప్రమత్తమైంది. ఈరోజు ( అక్టోబర్ 10న) జరగనున్న ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ కారణంగా రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా ఆపేశారు.
S. Jaishankar: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని ఎరివేసేందుకు ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు.
Supreme Court: తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అవయవాల అక్రమ రవాణా, అక్రమ కిడ్ని మార్పిడి కేసులపై సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు ఈరోజు ( అక్టోబర్ 10న) నిరాకరించింది.
H-1B Visa Rules: కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు ఇప్పటికే భారత్‌లోని ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమయంలో హెచ్-1బీ వీసాలో మరిన్ని మార్పులు చేసేందుకు ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
S*exual Assault: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కుంభకోణం సమీపంలోని ఒక ఆలయం లోపల 13 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ఆలయ పూజారి లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడిపై పోక్సో చట్టం కేసు నమోదు అయింది.
Trump Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈరోజు ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో ఈరోజు (అక్టోబర్ 10న) ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదు అయింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Rahul Gandhi: హర్యానా ఐపీఎస్ అధికారి వై పురాణ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఆత్మహత్యపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ ఆత్మహత్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ముడిపెడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.