Israel-Hamas Peace Deal: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన గాజా శాంతి ఒప్పంద ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ బందీల విడుదలతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణకు అవకాశం ఉంది.
Trump The Peace President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను ఏడు యుద్ధాలను ఆపినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ అతడ్ని ‘ది పీస్ ప్రెసిడెంట్’గా పేర్కొంది.
SSMB29: రాజమౌళి- మహేష్ బాబు సినిమా అంటే టైటిల్.. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ‘వారణాసి’ అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి.
Dowry Harassment: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం జరిగింది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ వివాహితను కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు.
United Nations: రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు సంస్థలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ఎఫెక్ట్, తాజాగా ఐక్యరాజ్యసమితి పైనా పడింది. పలు సంక్షోభ ప్రాంతాల్లో ఉన్న తమ శాంతి పరిరక్షకులను కుదించి తిరిగి వెనక్కి రప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15వ తేదీన ఆరంభమయ్యే మ్యాచ్ కోసం హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల కూడిన జట్టును ప్రకటించింది. అందులో తిలక్ వర్మను కెప్టెన్‌గా, రాహుల్ సింగ్ ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
ఎన్టీవీతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. అయినా, అది మా పార్టీ, మా కుటుంబ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం.. త్వరలోనే ఈ వివాదం సద్దుమణుగుతుందని అనుకుంటున్నాను.. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి నాతో మాట్లాడారు అని చెప్పుకొచ్చారు.
Fake PMO Official: హైదరాబాద్ లో పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు అయింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. PMOలో సీనియర్ అధికారిగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు.