S. Jaishankar: తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ కీలక భేటీ.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు
- ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ..
- ఉగ్రవాదాన్ని ఎరివేసేందుకు ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తాయి..
- టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చెబుతాం: కేంద్రమంత్రి జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S. Jaishankar: భారతదేశం-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సంబంధాలను బలపర్చుకుంటుంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని ఎరివేసేందుకు ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సీమాంతర ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న కొన్ని దేశాలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Rajamouli : బాహుబలి మాయాజాలం వెనుక రాజమౌళి కృషి.. జక్కన్న స్పెషల్ బర్త్‌డే వీడియో!
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఎక్సలెన్సీ, వృద్ధి, శ్రేయస్సు పట్ల మాకు ఉమ్మడి నిబద్ధత ఉంది అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అయితే, మన రెండు దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదం యొక్క ఉమ్మడి ముప్పు వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ఉగ్రవాదాన్ని అన్ని అంతం చేయడంతో పాటు టెర్రర్ కార్యకలపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం నిరంతరం సిద్ధంగా ఉండేందుకు సమన్వయం చేసుకోవాలి అని కోరారు. భారతదేశ భద్రతా సమస్యల పట్ల మీ సున్నితత్వాన్ని, మీ సంఘీభావాన్ని మేము అభినందిస్తున్నామని కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
Read Also: AP Liquor Scam Case: సుప్రీంకోర్టులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్‌కు నోటీసులు
అలాగే, ఆఫ్ఘనిస్తాన్ స్థిరత్వానికి భారతదేశం దీర్ఘకాలంగా మద్దతు ఇస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతో పాటు స్వాతంత్ర్యానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం మీ జాతీయ అభివృద్ధికి, అలాగే ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుంది. కాబూల్‌లోని భారతదేశ సాంకేతిక మిషన్‌ను భారత రాయబార కార్యాలయ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని జైశంకర్ ప్రకటించారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!