కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 'ఆర్థిక ఉగ్రవాదాన్ని' ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థికంగా దెబ్బ తీసేందుకు తమ బ్యాంకు ఖాతాల నుంచి 65 కోట్ల రూపాయలకు పైగా 'దోపిడీ' చేశారని ఆ పార్టీ పేర్కొంది.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గొనెగండ్ల మండలంలోని బి.అగ్రహారంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని తెలిపారు.
రష్యాలో చాలా కాలంగా నివసిస్తున్న ఓ అమెరికన్ డ్యాన్సర్‌ను దేశద్రోహం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థకు 51 డాలర్లు (దాదాపు 4 వేల రూపాయలు) విరాళంగా ఇచ్చినట్లు ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి.
సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)కు చెందిన కొన్ని అకౌంట్లను నిలిపివేయాలని కోరుతూ భారత సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని ఆ సంస్థ పేర్కొనింది. ప్రత్యేకమైన అకౌంట్ల నుంచి జరిగే పోస్టులను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎలాన్ మాస్క వెల్లడించారు.
జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలోని రెండు ఆలయాలకు గన్నవరం నియోజవర్గ టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మూడు లక్షల రూపాయల నగదు విరాళంగా అందజేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు మరోసారి సమన్లు ఇచ్చారు.
పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న ఎన్నికల రోజున ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సింధ్ హైకోర్టు (SHC) అసంతృప్తి వ్యక్తం చేసింది. అస్సలు ఇంటర్నెట్ అంతరాయానికి గల కారణాలను వివరించాలని సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది.
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం దేవాలయాలు కూడా పన్ను కట్టాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఉద్రిక్త కొనసాగుతుంది. ఇక, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మరోసారి గళం విప్పింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన నీటి బిల్లుల అంశంపై చర్చించనున్నారు.