కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం దేవాలయాలు కూడా పన్ను కట్టాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఉద్రిక్త కొనసాగుతుంది. ఇక, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మరోసారి గళం విప్పింది. సిద్ధరామయ్య ప్రభుత్వం బుధవారం నాడు కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ బిల్లు 2024’ని ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ‘హిందూ వ్యతిరేకి’ అని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. వాస్తవానికి, కర్ణాటకలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల నుంచి ఆలయాలపై 10 శాతం పన్ను వసూలు చేయాలని కన్నడ సర్కార్ నిర్ణయించారు. అదే సమయంలో 10 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం ఉన్న ఆలయాలు ఐదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది.
Read Also: Fire Accident: సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇక, కర్ణాటక ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప మాట్లాడుతూ.. సిద్ధరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించడం ద్వారా తన ఖాళీ ఖజానాను నింపుకోవాలని చూస్తోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. హిందూ దేవాలయాల ఆదాయంపై కూడా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని కర్ణాకట బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప పేర్కొన్నారు.