Pak: పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న ఎన్నికల రోజున ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సింధ్ హైకోర్టు (SHC) అసంతృప్తి వ్యక్తం చేసింది. అస్సలు ఇంటర్నెట్ అంతరాయానికి గల కారణాలను వివరించాలని సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. సింధ్ న్యాయస్థానం (SHC) చీఫ్ జస్టిస్ అకిల్ అహ్మద్ అబ్బాసీ, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు, సోషల్ మీడియాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచం ముందు మిమ్మల్ని మీరు ఎందుకు అవహేళన చేసుకుంటారని ప్రశ్నించారు.
Read Also: Mini Medaram Jatara: సిద్దిపేట మినీ మేడారం జాతర.. 12 గ్రామాల్లో సంబరాలు
ఇక, పాక్ లో ఇంటర్నెట్ సేవల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా దాఖలైన మూడు పిటిషన్లపై కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ మంత్రులు, పాక్ టెలికమ్యూనికేషన్ అథారిటీపై లాయర్లు జిబ్రాన్ నాసిర్, హైదర్ రజాతో పాటు పాకిస్తాన్ పబ్లిక్ ఇంటరెస్ట్ లా అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ ప్రారంభమైన వెంటనే, జస్టిస్ అబ్బాసీ మాట్లాడుతూ.. మీరు ఎన్నికలను నిర్వహించిన విధానం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూశారు.. ఎన్నికలు ఎలా జరిగాయో అంతర్జాతీయ మీడియా కూడా ప్రపంచానికి చెబుతోంది అని చీప్ జస్టిస్ అబ్బాసీ పేర్కొన్నారు.
Read Also: IPL 2024 Schedule: నేడు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్!
అయితే, దేశంలో ప్రతిచోటా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది అని న్యాయమూర్తి అబ్బాసీ వ్యాఖ్యానించారు. అలాగే, ఈ దేశానికి ఎవరు రాష్ట్రపతి, ఎవరు ప్రధానమంత్రి, ఎవరు గవర్నర్ పదవిని పొందుతారు అని ఆయన ప్రశ్నించారు.. ఇవన్నీ జరగాలంటే ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, విచారణను మార్చి 5కి వాయిదా వేస్తున్నాట్లు సింధ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అకిల్ అహ్మద్ అబ్బాసీ తెలిపారు.