ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. చిత్తూరులో వైసీపీ మూకల దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోవడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.
రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి టికెట్ తనకేనంటూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చెబుతుండగా.. కాదు తనకు పవన్ కల్యాణ్ మాట ఇచ్చారని జనసేన నేత కందుల దుర్గేష్ పేర్కొంటున్నారు. ఇక, రాజమండ్రిలో పవన్ టూర్ తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య రచ్చ స్టార్ట్ అయింది.
ఢిల్లీలో రైతులు మళ్లీ పోరుబాట పడుతున్నారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఛలో చేపట్టేందుకు రెడీ అయ్యారు.
వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ ప్రస్తానానికి సంబంధించి ఈరోజు కీలక ప్రకటనన చేసే అవకాశం ఉంది. వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుకు.. తీవ్ర మనస్థాపానికి గురైన వేమిరెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగా ఉంటున్నారు.
నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు భీమవరం చేరుకోనున్నారు.
ఏపీ సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో 11.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి 11.40 గంటల వరకు చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఇవాళ్టి నుంచి స్టార్ట్ అయింది. గత కొద్ది నెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి.
అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్నికి తాము పూర్తి వ్యతిరేకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అంతరిక్ష ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఈ పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి జారీ చేయనుంది.