తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు చేయబోతున్నారు.
మోడీ మాయలో ఎవరూ పడవద్దు.. ఉత్తర భారత జనతాపార్టీనీ తుక్కు తుక్కు గా ఓడించాలి అని పిలుపునిచ్చారు. పోలవరాన్ని ప్రక్కన పెట్టి ఉత్తరాంధ్రలో ఎలా పోటీ చేస్తారు.. కృష్ణ పట్నం పోర్టును తొక్కిపెట్టారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని ఓడించాలని పిలుపునిస్తున్నాం.. రాష్ట్రం గురించి ఒక్క మాట కూడా ప్రధాని మోడీ మాట్లాడలేదు అని చలసాని శ్రీనివాస్ తెలిపారు.
బొచ్చు గాళ్ళు వాళ్ళే వారసత్వం చేయాలా? మూడు తరాలుగా రాజకీయాలో ఉన్నాం.. నా కొడుకు ఎందుకు రాకూడదు? అని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే లేకుండా ఎవడు పడితే వాడు పార్టీ పెడితే నేను వెళ్ళాలా? అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలు క్లారిటీ రాలేదు.. తాము ప్రకటించిన అనపర్తి, పి.గన్నవరం స్థానాలను బీజేపీ, జనసేనలకు టీడీపీ వదిలి పెట్టింది. దీంతో టీడీపీలో పెండింగ్ స్థానాలు ఏడుకు పెరిగాయి.
విశాఖపట్నంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ ఎఫెక్ట్ తో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై నిషేధం విధించే ప్రమాదం ఏర్పడింది అని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించునున్నారు. రెండు రోజుల పాటు నేడు, రేపు విస్తృతంగా పర్యటించనున్నారు. ఇవాళ కుప్పంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐ అధికారులకి కొత్త డౌట్స్ వస్తున్నాయి. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆరు రకాల నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు.