రేపు ( సోమవారం) తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
డబ్బు, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు.. గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా.. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించి లోకేష్ ను, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటనే కొత్త సారథి పని ఈజీ అవుతుందని తెలిపాడు.
లోక్సభ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు భారత కూటమికి పెద్ద దెబ్బగా రుజువు చేస్తుందా లేదా ప్రతిపక్ష శిబిరాన్ని బలోపేతం చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు.
ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. జైలు నుంచి రాష్ట్రాన్ని నడిపించకుండా కేజ్రీవాల్ ను ఏ చట్టం ఆపదు అని పేర్కొన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై సీఎస్కే యాజమాన్యం ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.