తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు చేయబోతున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి వరుసగా పర్యటనలను ఆయన చేయనున్నారు. కాగా, ఈ నెల 27వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు పర్యటన ఖారారు అయింది.
Read Also: Hyper Aadi Marriage: అతని వల్లే నేను సింగిల్ గా ఉండిపోయాను.. హైపర్ ఆది కామెంట్స్..!
ఇక, ఈ నెల 27వ తేదీన పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ సెగ్మెంట్లల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే, 28వ తేదీన రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇక, 29వ తేదీన శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలుతో పాటు 30వ తేదీన మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరి పేట, శ్రీకాళ హస్తీలలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. చివరగా 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు అని తెలుగుదేశం పార్టీ పేర్కొనింది.