చిత్తూరు జిల్లా కుప్పంలో రెండ్రోజుల పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించునున్నారు. నియోజకవర్గంలో రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. రేపు ( సోమవారం) కుప్పంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అలాగే, రామకుప్పం మండలం, రాజుపేట వద్ద ఆంద్రినీవా కృష్ణ జలాల ప్రాజెక్ట్ పరిశీలించనున్నారు. కాగా, తొలి రోజు చంద్రబాబు ఉదయం 9:00 గంటల నుంచి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నుంచి ఉదయం 9: 20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడ ఉదయం 9: 30 నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక, ఉదయం 11: 15 నిమిషాలకి బెంగళూరు HAL ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఉదయం 11: 25 నిమిషాలకి పీఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రి హెలి ఫ్యాడ్ ఆవరణంకి చంద్రబాబు చేరుకుంటారు.
Read Also: IPL 2024: మ్యాచ్ ఓడినా రూ.24 కోట్ల బౌలర్ ను బెంబేలెత్తించిన సన్ రైజర్స్ బ్యాటర్స్..!
ఇక, రేపు ఉదయం 11: 40 నిమిషాలకి కొత్తపేట శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి దేవస్థానంకు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:00 గంటలకు కుప్పంలోని ఎన్టీఆర్ భవనానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12: 00 గంటల నుంచి 2: 00 వరకు స్థానిక కుప్పం టీడీపీ నాయకులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2:00 నుంచి 3 గంటల వరకు విరామం తీసుకుని.. మధ్యాహ్నం 3: 20 నిమిషాలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణానికి చేరుకుంటారు.. మధ్యాహ్నం 3:30 నిమిషాలు నుంచి 5: 30 నిమిషాల వరకు గంటల ఆర్టీసీ బస్టాండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5: 30 నిమిషాల నుంచి ఎన్టీఆర్ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కేవీఆర్ కళ్యాణ మండపం చేరుకోనున్నారు. సాయంత్రం 6:00 నుంచి 7:00 గంటల వరకు ఇఫ్తార్ విందుకు హాజరవుతారు.. రాత్రి 7: 20 నిమిషాలకి కేవీఆర్ కళ్యాణమండపం చేరుకుంటారు.. రాత్రి 7:30 నుంచి 8: 30 వరకు టీడీపీ కార్యాలయంలో స్థానిక టీడీపీ నేతలతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఇక, రాత్రి 8:45 నిమిషాలకు టీడీపీ కార్యాలయం నుంచి ఆర్ అండ్ బీ అతిధి విశ్రాంతి గృహానికి చంద్రబాబు చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
Read Also: Sangareddy Crime: ఫుట్ పాత్ పైకి దూసుకొని వచ్చిన బస్సు.. సీసీ ఫుటేజ్ దృశ్యాలు
ఇక, ఎల్లుండి ( మంగళవారం ) కూడా చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం నాడు ఉదయం 10: 50 నుంచి 11:00 నిమిషాలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం నుంచి కేవీఆర్ కళ్యాణ మండపం చేరుకుంటారు.. ఉదయం 11:00 నుంచి 12:50 నిమిషాలకి చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12:50 నుండి మధ్యాహ్నం 1:00 వరకు కె.వి.ఆర్ కళ్యాణమండపం నుండి బాబు నగర్ లో క్యాంపెనింగ్.. మధ్యాహ్నం 1:00 నుంచి 1:30 నిమిషాల వరకు ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనున్నారు.. మధ్యాహ్నం 1:40 నుండి 2:30 నిమిషాల వరకు విరామం తీసుకోనున్నారు.. మధ్యాహ్నం 2:30 నిమిషాల నుండి 3:30 వరకు టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 4:30 నిమిషాలకి రాజుపేట గ్రామం, రామకుప్పం చేరుకుంటారు.. సాయంత్రం 4:30 నుంచి 5:30 నిమిషాలకు వరకు హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలన చేయనున్నారు. సాయంత్రం 5:00 నుండి 6:00 గంటల వరకు రాజుపేట నుండి కుప్పం టీడీపీ కార్యాలయాన్ని చేరుకుంటారు.. సాయంత్రం 6 నుండి 7:45 వరకు టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 7:45 నుంచి 8:00 గంటలకు కి అర్ అండ్ బీ అతిధి విశ్రాంతి గృహం చేరుకుంటారు.. రాత్రి 8:00 గంటల నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణం చేయనున్నారు.