విశాఖపట్నంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ ఎఫెక్ట్ తో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై నిషేధం విధించే ప్రమాదం ఏర్పడింది అని పేర్కొన్నారు. ఇప్పటికే విదేశాల్లో ఏపీ ఎగుమతులను అనుమానిస్తున్నారు అని వారు తెలిపారు. డ్రగ్ డీల్ తర్వాత ఆక్వా పరిశ్రమకు నష్టం జరిగే అవకాశం ఏర్పడింది అని మెకనైజ్డ్ ఆపరేటర్స్ అసోషియేషన్ పేర్కొనింది. సంధ్య ఆక్వా సహా అనుబంధ కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని ఎంపెడాకు ఫిర్యాదు చేస్తామని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు జానకి రామ్ వెల్లడించారు.
Read Also: Minister Seethakka: నేడు నిర్మల్ లో మంత్రి సీతక్క పర్యటన..
ఇక, డ్రగ్స్ దిగుమతి కేసులో విశాఖ కంటైనర్ టెర్మినల్ ను సీబీఐ తన విచారణ పరిధిలోకి తీసుకుని దర్యాప్తు చేయాలి అని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ తెలిపింది. ప్రైవేట్ కంటైనర్ పోర్టు కావడంతో ఇష్టారాజ్యం నడుస్తోంది.. మత్స్యకారుల భూములతో నిర్మించిన కంటైనర్ టెర్మినల్ అక్రమ వ్యాపారాలకు అడ్డంగా మారిందని అర్థం అవుతోంది.. తక్షణం VCTPLను వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ స్వాధీనం చేసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. కస్టమ్స్ అధికారుల వైఫల్యం కారణంగానే విశాఖకు డ్రగ్స్ లాంటి ప్రమాదకరమైన పదార్ధాలు బయటకు వస్తున్నాయని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు జానకి రామ్ కోరారు.