Visakhapatnam: విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐ అధికారులకి కొత్త డౌట్స్ వస్తున్నాయి. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆరు రకాల నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. డ్రై ఈస్ట్ తో కలిపి రవాణా చేసిన మాదకద్రవ్యాలు సుమారు 2500 కేజీల వరకు వుండే అవకాశం ఉంది. న్యాయమూర్తి సమక్షంలో శాంపిల్స్ సేకరించిన తర్వాత మరొక కంటైనర్ లోకి మార్చి సీబీఐ ప్రత్యేక సీల్ వేసింది. ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్ లోని ఎగ్జామినేషన్ పాయింట్ లో భద్రపరచి శాంపిల్స్ ను ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.. కంటైనర్ ను అల్ వెదర్ ప్రూఫ్- అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే ప్రాంతంలో భద్రపరచాలని నిర్ణయం తీసుకుంది. కాగా, డ్రగ్స్ అవశేషాలు వాతావరణ ప్రభావానికి దెబ్బ తినకుండా సీబీఐ జాగ్రత్తలు తీసుకుంటుంది. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకునేందుకు సీబీఐ చూస్తుంది. వరుసగా ఐదవ రోజు విచారణ కొనసాగనుంది.
Read Also: IPL 2024: గెలుపుతో ముద్దులతో ముంచెత్తిన ప్రీతీ జింటా.. పాపం కావ్య పాప..!
అయితే, డ్రగ్స్ కంటైనర్ కేసులో సీబీఐ విచారణ పరిధిని విస్తరిస్తుంది. విశాఖ పోర్టులో కస్టమ్స్ అధికారుల కార్యకలాపాలపై ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించ లేదని సమాచారం.. పోర్ట్ నుంచి CFSకు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కస్టమ్స్ పని తీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున విశాఖ నగరంలో పట్టుబడ్డ ఈ సిగరెట్స్.. పకడ్బందీ సమాచారంతో టాయిస్ షాపుల్లో వున్న నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ- సిగరెట్లు కూడా పోర్టు నుంచే బయటకు వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం.. ఇప్పుడు డ్రగ్ కంటైనర్ పట్టుబడటంపై సీబీఐ అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.