ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కుపై ఏపీకి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విషమ పరిస్థితిలో ఉన్నారు.. నిజమైన ప్రజాస్వామ్య పద్దతిలో జరిగే చివరి ఎన్నికలు 2024..అంత్యంత ప్రమాదకర స్థితిలో ప్రజాస్వామ్యం ఉంది.. రాష్ట్రంలోని పార్టీలను బెదిరించి, భయపెట్టి మోడీ కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ టీడీపీ.. పవన్ కళ్యాణ్ ఎవరి ముందూ తలవంచనని చెప్పిన మోడీకి ఎందుకు తల వంచారు అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనలు చేశామన్నారు. మోడీ మాయలో ఎవరూ పడవద్దు.. ఉత్తర భారత జనతాపార్టీనీ తుక్కు తుక్కు గా ఓడించాలి అని పిలుపునిచ్చారు. పోలవరాన్ని ప్రక్కన పెట్టి ఉత్తరాంధ్రలో ఎలా పోటీ చేస్తారు.. కృష్ణ పట్నం పోర్టును తొక్కిపెట్టారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని ఓడించాలని పిలుపునిస్తున్నాం.. రాష్ట్రం గురించి ఒక్క మాట కూడా ప్రధాని మోడీ మాట్లాడలేదు అని చలసాని శ్రీనివాస్ తెలిపారు.
Read Also: IPL – T20s Rules: ఈ రూల్స్ కేవలం ఐపీఎల్ లో మాత్రమే.. ఇంటర్నేషనల్ టీ20ల్లో కాదండోయ్.. అవేంటంటే..?!
ఇక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా తో పాటు రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం చేసారు.. ప్రస్తుతం టీడీపీ, జనసేన కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా ఉన్నారు.. వైసీపీ మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది.. మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.