పాకిస్థాన్ లో క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు తాలిబన్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో రీల్ కోసం ఓ మహిళ వీడియోకు ఫోజులిస్తున్న సమయంలో ఓ దొంగ బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులను కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం (మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై బాలిస్టిక్ మిసైళ్లతో హౌతీలు దాడి చేశారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్తున్నారు. ఇవాళ ( సోమవారం ) మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో ఆయన పార్టీలోకి చేరబోతున్నారు.
చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యత అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే చేనేత కుటుంబం చనిపోయింది.. బీసీల ఆస్తులను కబ్జా చేసి ఇదేమని ప్రశ్నిస్తే బలి తీసుకుంటున్నారు ఆరోపించారు.
ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణంపై సందేహాలు కలిగిస్తోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారు అని విమర్శలు గుప్పించారు. ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారు.