ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (శనివారం) రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనుంది. బీజేపీకి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆయన సహరాన్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే, సాయంత్రం ఘజియాబాద్‌లో రోడ్ షో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక, పోస్టర్లు, బ్యానర్లతో రోడ్ షోకు రాకుండా పోలీసులు నిషేధం విధించారు. ఇవాళ సాయంత్రం నగరంలోని మలివాడ చౌక్ నుంచి అంబేద్కర్ రోడ్డులోని చౌదరి మోడ్ వరకు బీజేపీ అభ్యర్థి అతుల్ గార్గ్‌కు మద్దతుగా జనం పోటెత్తారు. ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Railway Jobs: పది అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
పోలీసులు హెచ్చరికలు..
1. హ్యాండ్‌బ్యాగ్, బ్రీఫ్‌కేస్, థర్మోస్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, స్టిక్, బ్యాగ్, బ్లేడ్, రేజర్ లేదా ఎలాంటి ఆయుధాలను తీసుకెళ్లడంపై నిషేధం.
2. ఫ్రేమ్డ్ పోస్టర్లతో పాటు బ్యానర్లతో రోడ్ షోలకు చేరుకోవడంపై నిషేధం.
3. దండలు, రేకులు, పుష్పగుచ్ఛాలతో పాటు సావనీర్లను తీసుకెళ్లవద్దు.
4. వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు ఉండకూడదు.
5. సిగరెట్లు, అగ్గిపుల్లలు, లైటర్లు, బాణసంచాపై నిషేధం.
6. రహదారికి కుడివైపున ఉన్న ప్రేక్షకుల గ్యాలరీలో మాత్రమే పౌరులు నిలబడటానికి అనుమతించబడతారు.
7. రోడ్ షో సమయంలో వీవీఐపీకి సమాంతరంగా నడవడానికి లేదా పరుగెత్తడానికి ఎవరూ అనుమతించబడరు.
8. డ్రోన్లు, పారాగ్లైడర్లు, హాట్ బెలూన్లతో పాటు ఇతర ఎగిరే వస్తువులు నిషేధించబడ్డాయి. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Congress: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ..
అలాగే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సహరాన్‌పూర్‌లో ప్రధానితో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇవాళే యోగి చాంద్‌పూర్ తో పాటు నగీనా (బిజ్నోర్)లో బహిరంగ సభలను కూడా పాల్గొంటారు. ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఖుర్జా (బులంద్‌షహర్), ఛతా (మథుర)లలో జరిగే బీజేపీ బూత్ అధ్యక్షుల సదస్సులలో ప్రసంగిస్తారు. బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయమని ప్రజలను సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరనున్నారు.