ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నాగు జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ భార్యలు పాల్గొన్నారు.
థామస్ ఐజాక్ ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించారు. ఐజాక్ పేరిట 9.6 లక్షల రూపాయల విలువ చేసే 20 వేల పుస్తకాలు తప్ప మరే ఆస్తి లేదని ఎన్నికల సంఘానికి తెలిపారు.
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితమే ఏర్పడింది. షాబాజ్ ప్రభుత్వం సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు మరో కఠిన నిర్ణయం తీసుకుంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు ద్వీపం అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1974లో ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని కమలం పార్టీ ఆరోపించింది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఏప్రిల్ 1) నుంచి గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ దాటికి నలుగురు చనిపోగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.
జ్ఞాన్వాపి అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. వివాదాస్పద కట్టడం యొక్క దక్షిణ చివరలో ఉన్న వ్యాస్ జీ నేలమాళిగలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీదు కమిటీ సవాలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ (సోమవారం) ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు.