అంబర్ పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభలో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతుందన్నారు. జూన్ 4న ఫలితాల రానున్నాయన్నారు. ప్రధాన మంత్రి ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు సభల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.. అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.. ఓటు అనేది మన హక్కు.. దానిని అందరు బాధ్యతయుతంగా వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read Also: Breaking: రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ప్రమాణం..!
అయితే, హైదరాబాద్ నగరంలో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాదు అని కిషన్ రెడ్డి అన్నారు. కానీ, మనం దృష్టి సారించాలి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలన్నారు. కాబట్టి అందరూ పోలింగ్ లో పాల్గొనాలని తెలిపారు. ఈసారి దేశం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.. దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలి.. దీంతో మన భవిష్యత్త్ కూడా బాగుపడుతుందన్నారు. 2014కు ముందు 50 ఏళ్లు దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది.. కానీ ఆ తర్వాత మోడీ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకోచ్చారో చూడండి అని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత పరిపాలన అందించిన మోడీ ప్రభుత్వ లక్ష్యం..దేశ భద్రతను, దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశారు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీఠ వేసారు అంటూ కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Tillu Square Collections : అదరగొడుతున్న టిల్లు గాడు.. 6 రోజులకు ఎన్ని కోట్లంటే?
ప్రతి ఒక్కరు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు మన హైదరాబాద్ నగరంలో ఏ విధంగా బలపడ్డాయో అందరికి తెలిసిందే.. లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్, దిల్ షుక్ నగర్ లాంటి ప్రదేశాల్లో మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు.. కర్ఫ్యూలు, మతకల్లాలు, బాంబుపేలుళ్లు ఉండేవన్నారు. కానీ, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బాంబుదాడులు లేవని పేర్కొన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఐదో ఆర్థిక అతి పెద్ద దేశంగా తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. యూకే లాంటి దేశాలను కూడా వెనక్కి నెట్టేసి ఐదో స్థానంలోకి రావడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణతోనే ఆర్థికంగా బలపడ్డామన్నారు. డిజిటల్ ట్రాన్జేక్షన్ చాలావరకూ పెరిగిందన్నారు. ఈ దేశంలో నిరక్ష్యరాస్యత ఉందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారని అన్నారు. కానీ ఈ రోజు ప్రతీ చిన్న దుకాణంలో సాంకేతిక లావాదేవీలు పెరిగాయన్నారు. సాంకేతికతో ఆర్థిక లావాదేవీల్లో అమెరికాను కూడా మించిపోయామన్నారు. ఇక, రామ జన్మ భూమి, ఆర్టికల్ 370, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. సైనిక, ఆర్మీలో మహిళలకు అవకాశం కల్పించామని కిషన్ రెడ్డి తెలిపారు.