IPL 2024: నేడు ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోటీ.. ఈ సారైనా బెంగళూరు గెలిచేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, ఇవాళ (ఏప్రిల్ 6న) రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో పోటీ పడబోతున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగు, బెంగళూరుకు ఐదో మ్యాచ్ కానుంది. అయితే, అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక, బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 ఓటములను చవి చూసింది.
Read Also: Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అలాగే, ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జట్లు మొత్తం 30 సార్లు పోటీ పడగా.. రాజస్థాన్ కంటే బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఇక, ఆర్సీబీ 15 మ్యాచ్‌లు గెలవగా, రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసుకుంది. ఇక, 3 మ్యాచ్‌ల ఫలితం రాలేదు.. 2020 నుంచి రాజస్థాన్ vs బెంగళూరు మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరగ్గా.. ఈ 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. 2022లో పూణెలోని ఎంసీఏ స్టేడియంలో బెంగళూరుపై రాజస్థాన్ 29 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Read Also: Manjummel Boys Review: మలయాళ ఇండస్ట్రీ హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ..
ఇక, జైపూర్ పిచ్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లకు మద్దతు ఇస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు 185 పరుగులకు పైగా స్కోర్ చేసింది. అయితే రెండు పర్యాయాలు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు లక్ష్యాన్ని కాపాడుకుంది. ఇది సవాయ్ మన్ సింగ్ స్టేడియం యొక్క పిచ్ ఆట సాగుతున్నప్పుడు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఇవాళ వర్షాలు కురిసే అవకాశం లేదు.. ఉష్ణోగ్రతలు సాయంత్రం 20 శాతం తేమతో 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also: PM Modi: నేడు ఘజియాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షో..
తుది జట్లు అంచనా:
రాజస్థాన్ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బెర్గర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ, సందీప్ శర్మ.
బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, యశ్ దయాల్, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..