KRMB Meeting: నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు త్రిమెన్ కమిటీ నేడు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. కమిటీలో బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాలు ఈఏన్సీలు సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లోనే భేటీ అయింది.. రెండు రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేఆర్ఎంబీ కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్ అవసరాలకు ఉపయోగించాలని చెప్పింది. అయితే, తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకుంది.
Read Also: IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. సూర్య వచ్చేస్తున్నాడు!
Also Read
కాగా, ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా, మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయని కేఆర్ఎంబీకి తెలిపింది. అయితే, ఏప్రిల్‌లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేఆర్‌ఎంబీకి లేటర్ రాసింది. కోటాకు మించి 2టీఎంసీలను కోరుతుంది. ఈ నేపథ్యంలో త్రిమెన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఇక, కేఆర్ఎంబీ నిర్వహించే త్రీ మెంబర్ కమిటీ సమావేశానికి హాజరుకాలేమని రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి లెటర్ రాసినట్టు సమాచారం. తెలంగాణ ఈఎన్సీ (జనరల్) లీవ్ లో ఉండడంతో ఈ మీటింగ్ కు రాలేకపోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నుంచి అధికారులు రాకపోవడంతోతాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్ఎంబీకి ఏపీ కూడా లేఖ రాసినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీ అధికారులు లెటర్ రాసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!