ఐపీఎల్ లో గత కొంతకాలం నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతుంది. ఏంఐ జట్టుకు రోహిత్ శర్మ ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. అలాంటి అతడ్ని ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారధ్య బాధ్యతలను తప్పించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి తమ జట్టులోకి హార్దిక్ పాండ్యాను తీసుకొని మరి అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.
Read Also: Rajnath Singh: పాకిస్థాన్‌కు వెళ్లి మరీ ఉగ్రవాదుల్ని హత మారుస్తాం..
అయితే, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ టీమ్ ఈ ఏడాది ఐపీఎల్లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తుంది. అదే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యా అవమానిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. ఇలాంటి సమయంలో ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నాటికి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లో కొనసాగుతాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక, ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Read Also: సీఎంతో వెంకీ మామ.. అట్లుంటది మనతోని…
ఇక, 2024 ఐపిఎల్ సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకోవాలని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అతడు పూర్తిగా అసంతృప్తితో ఉన్నాడని టాక్. ఇక, ఈ విషయాన్ని ఒక ముంబై ప్లేయర్ చెప్పినట్లు పలు మీడియా కథనాలు ప్రచారం చేశాయి. అయితే, వచ్చే ఏడాది జరగబోయే మెగా ఆక్షన్ లో హిట్ మ్యాన్ పాల్గొంటారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే రోహిత్ శర్మను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు భారీ ధర పెట్టే ఛాన్స్ ఉంది.