ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఆదివారం) జరుగబోయే కీలక మ్యాచ్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ పేసర్ మతీశ పతిరణ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. పతిరణ గాయంపై అప్‌డేట్‌ను సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. పతిరణ సీఎస్‌కే ఆడబోయే నెక్ట్స్ మ్యాచ్ వరకు కోలుకుంటాడని చెప్పుకొచ్చారు. అయితే, పతిరణ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు.. ఆ తర్వాత చెన్నై ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండిపోయాడు. పతిరణ గైర్హజరీలో సీఎస్‌కే సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోగా.. కేకేఆర్‌పై ఘన విజయం సాధించింది.
Read Also: Jagga Reddy: నీకెందుకు అంత బాధ.. అభిమానిపై జగ్గారెడ్డి
ఇక, ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ మెరుపుల కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు.
Read Also: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..
కాగా, ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండు విజయాలతో గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో ఉంది. అయితే, ఇప్పటి వరకు ముంబై వర్సెస్ చెన్నై మధ్య హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికి వస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు జరగగా అందులో ముంబై 20 సార్లు, సీఎస్‌కే 16 మ్యాచ్‌ల్లో గెలిచాయి.