అంకాపూర్ లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధి బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ సంకల్ప పత్రం ఓట్లు దండుకోవడానికి కాదు.. దేశ ప్రజల భవిష్యత్త్ నిర్ధారించదానికి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ హయాంలో 100 రూపాయల్లో 15 రూపాయలు మాత్రమే లబ్ది దారులకు అందేవి, మధ్యలో 85 రూపాయలు దళారులకు వెళ్ళేవి అని ఆరోపించారు. ప్రధాని ద్వారా పసుపు బోర్డ్ ప్రకటన ఇప్పిచ్చిన ఘనత ఎంపీ అరవింద్ కే దక్కుతుంది అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడ్డ నాయకుడు ఎంపీ అరవింద్.. కాంగ్రెస్ హయాంలో రైతులకు అన్ని ఇబ్బందులే.. ఎంఎస్పీ కింద రైతులకు మద్దతు ధర ఇస్తాం అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
Read Also: Bhanu Prakash Reddy: సీఎంకే భద్రత లేకపోతే ఎలా..? అధికారులు నిద్రపోతున్నారా..?
రైతులను ఆదుకొనే ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు. మోడీ పథకాలు రాష్ట్రంలో అమలు కానివ్వడం లేదు అని చెప్పుకొచ్చారు. వికసిత భారత్ గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు లేదు అని పేర్కొన్నారు. అవినీతి, కుంభ కోణాలు, కుటుంబ పార్టీలు, నరేంద్ర మోడీని విమర్శించడం సిగ్గు చేటు అంటూ ఆయన మండిపడ్డారు. బీజేపీ తప్ప మిగతావన్నీ వారసత్వం కోసం రాజకీయాలు చేసే పార్టీలే అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు కేసీఆర్ అపరభగీరథుడు కాదు అపర అవినీతి పరుడు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపణలు చేశారు.