Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో.. కోఠిలోని సీబీఐ జీడీకి కంప్లైంట్ చేసినట్లు పాల్ తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో 50 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వెల్లడించినట్లు వివరించారు. తెలంగాణ హైకోర్టులో ఈ నివేదిక ఉన్నప్పటికీ సీబీఐ విచారణకు అదేశించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ముఖ్యమంత్రి లేఖ రాయాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బయట పెట్టే వరకు తాను పోరాటం చేస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్.
Read Also: Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ ఆరోజే.. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్..?
ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పూర్తిగా బయటకు తీస్తాను అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటాను అని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి లక్ష కోట్ల నుంచి వడ్డీ కలుపుకుని రెండు లక్షల కోట్లకు పెరిగిందన్నారు. అలాగే, ఈసారి కేంద్రంలోని బీజేపీకి 370 సీట్ల కంటే ఎక్కువ వస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని కేఏ పాల్ ఆరోపించారు.