Rishi Sunak: రోజురోజుకి తగ్గిపోతున్న పాపులారిటీ.. ఓటమి దిశగా రిషి సునాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్‌కు తొలి భారత సంతతి ప్రధానిగా చరిత్ర సృష్టించిన కన్సర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్‌కు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఏర్పాడింది అని విశ్లేషకులు తెలిపారు. హామీలు నెరవేర్చడంలో వైఫల్యాలు, ప్రతికూల ప్రజాభిప్రాయం మేరకు ఆయనను ఓటమి దిశగా నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 18 నెలల కాలంలో ఆయన రెండు సార్లు పన్నుల్లో కోతలు విధించారు. ఆర్థిక రంగాన్ని కొంత మెరుగు పరిచారు. కానీ, ఇవేవీ రిషి సునాక్‌కు రాజకీయంగా లాభం చేకూర్చినట్లు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Ponnam Prabhakar: తాటి చెట్లు అగ్నికి గురికాకుండా ఉండాలి.. అధికారులకు పొన్నం సూచన
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
అయితే, 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు అక్కడి వర్గాలు చెప్తున్నారు. రోజు రోజుకూ మద్దతు తగ్గిపోతున్న నేపథ్యంలో రిషి సునాక్ నిస్సహాయంగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గతనెలలో జరిగిన యూగొవ్ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి కేవలం 154 మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. కీర్ స్టేమర్ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఏకంగా 403 సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడైంది. ఇక, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు రిషి సూనాక్ కి ప్రతిబంధకంగా మారినా కొన్ని స్వయంకృతాపరాథాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్పుకొచ్చారు.
Read Also: Kishan Reddy: అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.?
అలాగే, ఇచ్చిన హామీ ప్రకారం.. సునాక్ దేశంలోకి వలసలను నిరోధించలేకపోయారు, ఫ్రాన్స్ నుంచి బోట్లల్లో కాందీశీకులు బ్రిటన్‌కు వస్తున్నారని రాజకీయ నిపుణులు చెప్పుకొచ్చారు.. ద్రవ్యోల్బణం తగ్గినా ఆర్థికరంగంలో పురోగతి లేదు.. నేషనల్ హెల్త్ సర్వీసుల్లో వేయింటింగ్ లిస్టు రోజురోజుకీ పెరుగుతుండటంతో బ్రిటన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందంటున్నారు. ఇక, మార్చిలో వచ్చిన ఓ సర్వే ప్రకారం.. దేశ ఓటర్లలో 58 శాతం మంది కన్సర్వేటివ్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సర్వేలో రిషి సునాక్‌కు ఏకంగా మైనస్ 38 రేటింగ్ ఇచ్చారు. సాధారణ బ్రిటన్ ప్రజానీకానికి రిషి సునాక్ దూరమయ్యారని అక్కడి రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కాగా, ప్రధాని సునాక్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!