ఇవాళ ఎంతో మంచి రోజు.. ఉత్తమ మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్‌నాథ్ సింగ్‌ను అభినందిస్తున్నాను.. అలాగే, మేనిఫెస్టో కమిటీకి అభినందనలు తెలిజేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గత పదేళ్లలో దేశాభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం.. ఈ పదేళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన చేపట్టాం.. బీజేపీ సంకల్ప పత్రం యువత ఆకాంక్షలను ప్రతిబింభిస్తోంది.. యువత, మహిళలు, పేద వర్గాలపై ఫోకస్ చేశాం అన్నారు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తాం.. పేదల జీవితాలు మార్చడమే మోడీ ఇస్తున్న గ్యారెంటీ నరేంద్ర మోడీ అన్నారు.
Read Also: Asaduddin Owaisi: తెలంగాణలో ఏ పార్టీలతోనూ ఎలాంటి పొత్తు లేదు.. తేల్చేసిన ఒవైసీ
ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త సంవత్సరం మొదలవుతుంది అని ప్రధాని మోడీ తెలిపారు. కాత్యాయని మాత తన రెండు భుజాలపైన కమలం పువ్వులు ఉంటాయి.. ఇవాళ అంబేద్కర్ జయంతి కూడా.. అన్ని కలిసి వచ్చిన పవిత్రమైన ఈ రోజునే బీజేపీ సంకల్ప పత్రను విడుదల చేసింది అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ బీజేపీ సంకల్ప పత్రం కోసం ఎంతో ఆసక్తి ఉంటుంది.. మా మేనిఫెస్టోలో నాలుగు అంశాల పైన ప్రధానంగా ఫోకస్ ఉంటుంది అని ఆయన చెప్పారు. యువశక్తి, నారిశక్తి, గరీబ్ యోజన, కిసాన్ యోజనపై యువ భారత్ కి, యువ ఆకాంక్షలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రతిబింబంగా నిలుస్తుంది అని మోడీ పేర్కొన్నారు.