చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు బాధలు ఫ్రీగా కల్పిస్తుందని అన్నారు.
మహారాష్ట్ర అధికార కూటమి మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన ( షిండే వర్గం) ఎన్సీపీ( అజిత్ వర్గం ) పార్టీల మధ్య తీవ్ర కసరత్తు చేసిన తర్వాత ఎట్టకేలకు లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకానికి ఒప్పందం కుదురింది.
మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబుని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నా రాంబాబు సతీమణి దుర్గా కుమారి అభ్యర్థించారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీ దారుల దగ్గర నుంచి రాజకీయ విరాళాలు సేకరించడం కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు.
మేడే వేళ తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. విరుదునగర్ జిల్లా కారియాపట్టి శివారులోని అవియార్ క్వారీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సంఘటన జరిగిన ప్రదేశంలోనే మరణించగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పార్టీలో నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది.. ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవడం కష్టమైన పని ఏమి కాదని ఆయన చెప్పారు. కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం సఫలీకృతమయ్యే సమయం ఆసన్నం అయిందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.