రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎనిమిది మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కొర్రపాడు, విశదల, మందపాడు, సిరిపురం, వరగాని గ్రామాల్లో పర్యటించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజక వర్గ పరిధిలోని నందిగామ పట్టణంలోని ఆర్ టి ఓ కార్యాలయం రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు తనధైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు చేసింది సీఎం జగన్ మాత్రమేనని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీలకు జరిగిన మంచిని వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్న పలు బీసీ సంఘాల నాయకులు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు.
గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రపై భారత ప్రభుత్వం స్పందించింది. ఇంత తీవ్రమైన అంశంలో నిరాధారమైన నివేదిక ప్రచురించబడిందని భారతదేశం చెప్పుకొచ్చింది.
అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని అమిత్ షా అన్నారు. SC,ST, OBCలకు రిజర్వేషన్లు ఉండటానికి బీజేపీ ఎప్పుడు మద్దతు ఇస్తుందని తెలిపారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీలో మన్మోహన్ సింగ్తో పాటు జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ పోస్టర్లు వెలిశాయి.