భారత్‌తో దౌత్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మాల్దీవుల విదేశాంగ మంత్రి ఇక్కడ పర్యటించేందుకు రాబోతున్నట్లు సమాచారం. రెండు దేశాల మధ్య పర్యటన తేదీని నిర్ణయించనప్పటికీ, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే మొదటి లేదా రెండవ వారంలో భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.దీంతో చైనాకు అనుకూలంగా ఉన్న మాల్దీవుల ప్రభుత్వం భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మూసాపర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Read Also: Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్
కాగా, గత కొన్ని నెలలుగా భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు గందరగోళంగా ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందడానికి ముందు మహ్మద్ ముయిజ్జూ భారత దళాల ఉపసంహరణ నినాదాన్ని లేవనెత్తడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముయిజ్జూ భారత సైనికులను మాల్దీవుల నుంచి ఉపసంహరించుకునేందుకు మే 10 వరకు పరిమితి విధించారు. వాస్తవానికి, భారతీయ హెలికాప్టర్ల ఆపరేషన్, నిర్వహణ కోసం మాల్దీవులలో భారతీయ సైనికులు మోహరించారు. ఇప్పుడు సైనికుల స్థానంలో భారతీయ ఇంజనీర్లు వచ్చారు.
Read Also: Allari Naresh : ఆ సినిమాతో మళ్ళీ సొంత గ్రౌండ్ లో ఆడుతున్నట్లు వుంది..
ఇక, మాల్దీవులలో గత కొన్ని దశాబ్దాలుగా, కొత్త ప్రెసిడెంట్ మొదట భారతదేశాన్ని సందర్శించేవారు, అయితే, ముయిజ్జూ మాత్రం ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి.. చైనాను సందర్శించాడు. ముయిజ్జు భారత్‌తో రక్షణ, భద్రతా సహకారాన్ని పరిమితం చేయాలనుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా బంపర్ విజయం సాధించిన తర్వాత.. ముయిజ్జూ బలం మరింత బలపడింది. ఇక, భారత్‌తో దౌత్యపరమైన సహకారం కోసం మాల్దీవులు ఈ నెలలో భారత్‌ను సందర్శించే ఛాన్స్ ఉంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్‌కు రావడం ముయిజ్జూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది మొదటి అధికారిక పర్యటన అవుతుంది. భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటన కొనసాగుతుంది. జమీర్ పర్యటన మే 10 గడువులోగా జరిగే అవకాశం ఉంది.