కాకినాడ జిల్లా తునిలో తండ్రి దాడిశెట్టి రాజా గెలుపు కోసం తనయుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు.
ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని భుజబలపట్నం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సతీమణి దూలం వీర కుమారి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3వ తేదీన పెదకూరపాడు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు.
చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.19 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో కలిగిరి ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డ్ నెంబర్లు, ముఖ్య నాయకులు సుమారు 1000 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
దేశవ్యాప్తంగా మణిపుర్ రాష్ట్రంలో హింసాత్మక దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంతో పాటు సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకపోగా.. అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ తన ఛార్జిషీటులో తెలిపింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు కష్టమయ్యేలా కనిపించడంతో జమ్మూ- కశ్మీర్‌లోని అనంత్‌నాగ్- రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఎలక్షన్స్ ను మే 25వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం నాడు నిర్ణయించింది.
ఏలూరు జిల్లా కైకలూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో లోడిద లంక, పలాటపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.