మేడే వేళ తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. విరుదునగర్ జిల్లా కారియాపట్టి శివారులోని అవియార్ క్వారీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సంఘటన జరిగిన ప్రదేశంలోనే మరణించగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, క్వారీలో రాళ్ల నుంచి సిల్ట్, ఎమ్ ఇసుక మొదలైన పదార్థాలు విరిగిపోతాయి.. వాటిని ఈ క్రషర్‌లో పగులగొట్టేందుకు పేలుడు పదార్థాలను వాడుతుంటారు. ఈరోజు ఉదయం క్వారీ సమీపంలోని ఓ గదిలో బండరాళ్లు పేలి పోయే పేలుడు పదార్థాలు పేలినట్లు సమాచారం.
Read Also: Covishield : 10 లక్షలలో ఏడుగురికే దుష్ప్రభావాలు.. కోవిషీల్డ్ పై ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్తలు
అయితే, ఈ ప్రమాదం కారణంగా అటవీ ప్రాంతంలో మానవ దేహాలు చెల్లాచెదురుగా పడిపోయి కనిపించాయి. అలాగే, పేలుడు పదార్థాలు ఉన్న భవనం సమీపంలోని రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద ప్రాంతంలో పేలుడు పదార్థాలు ఉండడంతో సహాయక చర్యలు చేపట్లటలేకపోతున్నామని అధికారులు చెప్పారు. ఈ పేలుడు సమయంలో కారియాపట్టి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు దాదాపు 20 కిలో మీటర్ల దూరం వరకు భారీ శబ్దం వచ్చిందని తెలిపారు.
తమిళనాడులో భారీ బాంబు పేలుడు.. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్‌లోని క్వారీలో ఘటన.. నలుగురు మృతి, 10 మందికి పైగా తీవ్రగాయాలు.. పేలుడు ధాటికి ఎగిరిపడిన మృతదేహాలు.. కొరియా పట్టి హైవేపై స్థానికుల ఆందోళన, భారీగా ట్రాఫిక్ జామ్#TamilNadu
— NTV Breaking News (@NTVJustIn) May 1, 2024