Ac Not Working: ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేయని ఏసీలు.. ఉక్కపోతతో రోగులు ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక ఉష్ణోగ్రతలతో పాటు భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అమర్చినా ఏసీలు పనిచేయకపోవడంతో పసికందులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లల పరిస్థితిని చూసి తల్లులు, అటెండెంట్లు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఆస్పత్రి ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉంది. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉంటాయనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు.
Read Also: Disha Patani Bikini: బికినీలో దిశా పటానీ.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!
Also Read
అయితే, నెలలు నిండకుండానే జన్మించిన పసికందులకు ఎంజీంలోని పీడియాట్రిక్ యూనిట్ ఐసీయూ/హెచ్‌డీయూ వార్డుల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటారు. వీరి కోసం రెండు వార్డుల్లో కలిపి నాలుగు చొప్పున 8 ఏసీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పని చేయడం లేదు.. ఓ వైపు ఎండలతో ఉష్ణోగ్రత స్థాయి పెరిగి పసికందులు తల్లడిల్లిపోతున్నాయి. ఇక, ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, ఉక్కపోత తల్లులు భరించలేకపోతున్నారు. తమ పిల్లల వ్యాధులను నయం చేసుకుందామని వస్తే ఇక్కడ నరకం చూడాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసికందులు చికిత్స పొందుతున్న వార్డుల్లో ఏసీలు పెట్టి ఏం లాభం అంటూ మండిపడుతున్నారు. మేమే వేడి భరించలేక ఉక్కపోత, చెమటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. ఇక, మా చిన్నారులు ఎలా భరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పని చేయని ఏసీలను వార్డులో ఎందుకు పెట్టారంటూ హస్పటల్ లో వైద్యం కోసం వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!