Kishan Reddy: తొలి విడతలో పోలింగ్ తగ్గిన తరువాత మోడీ కొన్ని సూచనలు చేశారు అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అపార్మెంట్స్ వాసులకు రిక్వెస్ట్ చేయమని మోడీ చెప్పారు.. కాలనీ, అపార్ట్మెంట్ వాసులతో సమావేశం కావాలని చెప్పారు.. వారందరూ ఓటింగ్ లో పాల్గొనాలని కోరుతూ.. ఇతరులను కూడా పాల్గొనేలా చేయాలని మోడీ సూచించారు అని తెలిపారు. ఇక, మోడీ పని రాక్షసుడు.. ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరమైన నాయకుడు.. సెలవు ఉంది కదా అని ఓటెయ్యకుండా ఉండకండి.. ఓటేసి సెలవు తీసుకోండి అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Rajnath Singh: బీజేపీ ఎప్పటికీ రాజ్యాంగాన్ని మార్చదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ఈ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానని కిషన్ రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్త్ కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం ఓటేయాలన్నారు. అనేక సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణలో పని చేస్తోంది.. ఇవాళ ఉన్నటువంటి సానుకూల వాతావరణం గతంలో ఎన్నడూ కనిపించలేదు.. మహిళలు, యువకులు, రైతులు, మధ్య తరగతి ప్రజలు బీజేపీకి అండగా నిలుస్తున్నారు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మా పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ సునామీ లాంటి అండర్ కరెంట్ క్షేత్రస్థాయిలో కనబడుతోంది.. జూన్4న వెలువడే ఫలితాల్లో ఈ ప్రభంజనాన్ని చూస్తారు.. దేశానికి ఏయే పార్టీలు ఏం చేశాయనే అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి.. ఆ ప్రాతిపదికనే ఓట్లేయాలి.. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మోడీ ప్రధాని కాకముందు.. మోడీ ప్రధాని అయిన తర్వాత వచ్చిన మార్పులను ప్రజలు చర్చించాలి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Britney Spears Divorce: మూడోసారి విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!
ఇక, పదేళ్లకు ముందు దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం, అవినీతి కుంభకోణాలు రోజూ పేపర్ల బ్యానర్లలో ఉండేవి అని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి.. సుప్రీంకోర్టు తీర్పు, కాగ్ రిపోర్టులే ఈ విషయాలను వెల్లడించాయి.. ఇక, 2014లో ప్రజలు రెండు అంశాలమీద ఓటేశారు.. ఒకటి అవినీతి రహిత ప్రభుత్వం.. రెండోది సమర్థ నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారు.. కాంగ్రెస్ అవినీతిపై ప్రజలు విసిగి వేసారిపోయారు.. అభివృద్ధి చెందాలనే ప్రజల్లో పట్టుదల కనిపించింది.. మేము అవినీతిపై కఠినంగా వ్యవహరించామని ఆయన చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవు.. నేడు దేశంలో మతకల్లోలాలు లేవు.. ఐఎస్ఐ కార్యకలాపాలు లేవు.. దేశంలో 32 ఏళ్ల తర్వాత 2014లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది.. 2019లో అంతకన్నా ఎక్కువ సీట్లు ఇచ్చి మోడీకి మద్దతు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ అవినీతి, బంధుప్రీతిని మేం ఈ పదేళ్లలో సరిదిద్దామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.