Kadiyam Srihari: వరంగల్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కవ్యకు మద్దతుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది.. అభివృద్ధితో పాటు భూకబ్జాలకు పాల్పడింది.. కేసీఆర్ కూతురు చేసిన లిక్కర్ స్కామ్ తో తీహార్ జైలుకి వెళ్ళిందన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రామాలను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వచ్చానని పేర్కొన్నారు. ఇక, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి అని కడియం శ్రీహరి వెల్లడించారు.
Read Also: Election Commission: ఈసీకి ఫిర్యాదులు.. ఇద్దరు డీఎస్పీలపై వేటు
ఇక, ప్రస్తుత రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి మళ్లీ లేచే పరిస్థితి లేదు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అని చెప్పుకునే రాజయ్యను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోలేదు.. దుర్మార్గుడివాని ఇందిరా నిన్ను కాంగ్రెస్ లోకి రానివ్వలేదు.. బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ చేరిన రాజయ్యను కాదని కరీంనగర్ కు చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. నీకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు అంటేనే నీ రాజకీయ పలుకుబడి ఏంటో తెలుస్తుంది.. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా అనే సోయి లేకుండా స్టేజీల మీద ఇష్టం వచ్చినట్లు ఎగురుతున్నాడు అంటూ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు.