ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రెండోసారి నందిగామ ఎమ్మెల్యేగా మొండితోక జగన్మోహన్ రావు గెలిచిన తర్వాత ఏం చేస్తామో అనేదే ఈ మేనిఫెస్టోలో చెప్పుకొచ్చామన్నారు. నందిగామ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేశాం.. మన నందిగామ మన మేనిఫెస్టో ప్రకారం రానున్న రోజుల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Kolikapudi Srinivasa Rao: ప్రచారంలో దూసుకెళ్తున్న కొలికపూడి శ్రీనివాసరావు
రెండోసారి నందిగామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జగన్ మోహన్ రావు గెలిచిన తర్వాత వచ్చే ఐదేళ్లలో ఎంత సమయంలో ఏయే పనులు చేస్తామో ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు చెబుతున్నామని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వెల్లడించారు. ప్రతి గ్రామంలో ఏయే అభివృద్ధి పనులు చేస్తామో ఈ మేనిఫెస్టో ద్వారా వివరించామన్నారు. ఐదేళ్లలో నందిగామలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం చేసిన లబ్ధిని కూడా ఇప్పటికే తెలియజేశాం.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా మేము కూడా నందిగామ నియోజకవర్గంలో 99 శాతం మేనిఫెస్టోను అమలు చేస్తామని మొండితోక అరుణ్ కుమార్ తెలిపారు.