AP Elections 2024: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారనేది టీఆర్ఎస్ చేస్తున్న బురద జల్లే ప్రయత్నం అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీలోకి చేరాల్సిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీఆర్ఎస్ అసత్య ప్రసారం చేస్తుంది.. ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసమే ఈ దుష్ప్రచారం అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
Read Also: Rana Daggubati : ఇండియాను ఊపేసే సినిమా లోడింగ్..
ఇక, బీజేపీ అడ్డగోలుగా వెళుతుంది అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విభజన పంపకాలకు సంబంధించి ఏపీలో ఏ ముఖ్యమంత్రి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చుని పరిష్కరిస్తారు అని చెప్పుకొచ్చారు. ఈ దేశాన్ని పాడు చేస్తుంది భారతీయ జనతా పార్టీయే అన్నారు. వైసీపీ, టీడీపీ విషయంలో పూర్తి స్థాయిలో అలోచించి ఓటు వేయాలి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ప్రజలంతా సానుకూల దృక్పదంతో అలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి పుర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పని చేస్తుంది అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.