PM Modi: నేడు యూపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ ఏడో విడత ఎన్నికల కోసం బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మిర్జాపూర్, మౌ, డియోరియాలలో నిర్వహించే బహిరంగ సమావేశాల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. తొలి సమావేశం ఉదయం 9:30 గంటలకు మీర్జాపూర్‌లో జరగనుంది. బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అప్నా దళ్ (ఎస్) కూడా రాబర్ట్స్‌గంజ్ స్థానం నుంచి పోటీలో ఉంది. అక్కడి నుంచి పార్టీ ఎమ్మెల్యే రింకీ కోల్‌ను రంగంలోకి దించింది. ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేయాలని మోడీ ప్రజలకు కోరనున్నారు.
Read Also: Rajkot Massive Fire : రాజ్ కోట్ లో 27మంది ప్రాణాలు గాల్లో కలవడానికి కారణం ఎవరు ?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అలాగే, నేటి ఉదయం 11:15 గంటలకు మౌలోని మేవారి కలాన్‌లోని ఘోసి, బల్లియా, సేలంపూర్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు డియోరియాకు చేరుకుంటారు. అక్కడ రుద్రాపూర్‌లో ఆయన ఎన్నికల సభలో పాల్గొంటారు. బన్స్‌గావ్, డియోరియా నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు సపోర్టుగా మోడీ ప్రచారం నిర్వహించనున్నారు.
Read Also: Remal cyclone effect: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు రద్దు
అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీర్జాపూర్, వారణాసి, ఘాజీపూర్, గోరఖ్‌పూర్‌లలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మిర్జాపూర్‌లో ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత వారణాసిలోని శివపూర్‌లోని కచ్చా బాబా ఇంటర్ కాలేజీలో, మధ్యాహ్నం 2.45 గంటలకు ఘాజీపూర్‌లోని టౌన్ నేషనల్ ఇంటర్ కాలేజీలో చందౌలీ లోక్‌సభ స్థానం అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇక, మధ్యాహ్నం 3.10 గంటలకు గోరఖ్‌పూర్‌లోని జనతా ఇంటర్ కళాశాలలో ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..