పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. ఈశాన్య దిశగా కదులుతూ 24 గంటలో తీవ్ర వాయుగుండంగా బలపడి "రేమాల్" తుఫాన్ గా ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. "రేమాల్" తీవ్ర తుఫాన్ గా మారి ఈనెల 27వ తేదీన అర్థరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందని పేర్కొనింది.
రాష్ట్ర ప్రధాన పార్టీలూ అన్ని కలిపి 10 వేల కోట్లు ఖర్చు పెట్టారు.. ఎలక్షన్ కమిషన్ కూడా అమ్మడు పోయింది.. పిన్నెలి తప్పు చేసాడు కాబట్టే గన్ మెన్ లను సైతం విడిచి పెట్టి రాష్ట్రం వదలి పరారి అయాడు అని పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారు అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించిన పలు ఆరోపణలు చేశారు.. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారు.. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసిరాను.. బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు పోలింగ్‌కు ముగిసింది. ఇక, జూన్ 4వ తేదీన తుది ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సర్వేలన్నీ మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఘన విజయం సాధించబోతుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమికి వస్తాయని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. అమరావతిలోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువనేశ్వరి డిసైడ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక, చంద్రబాబు ఆత్మ కథలో నాకో పేజీ ఉంటుంది.
పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఘర్షణలలో దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ చేశారు. సిట్ టీమ్ దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతుంది అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు తుఫాన్ గా మారితే రెమల్‌గా నామకరణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో ఎన్నికల సమయంలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ టీమ్ వెళ్లనుంది. జిల్లాల్లో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది.