IPL Final: చెన్నైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. హైదరాబాద్లో హంగామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Final: ఐపీఎల్– 2024లో తుది సమరానికి సర్వం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్–17 విజేతను తేల్చే మ్యాచ్ నేడు చెన్నై వేదికవుతోంది. ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ జట్టు రాజస్థాన్ కు ఆఖరి పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కేకేఆర్ తో ఇప్పుడు మళ్లీ పోటీ తలపడబోతుంది. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు హైదరాబాదీ టీమ్ ఎదురు చూస్తుంది. సన్ రైజర్స్ చెలరేగితే రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచే ఛాన్స్ ఉంది. 2016లో చివరిసారిగా టైటిల్ సాధించిన హైదరాబాద్ 2018లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది. 2012, 2014లలో ఐపీఎల్ టైటిల్ గెలుచిన కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై నజర్ పెట్టింది. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుండడంతో మన హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ గెలిస్తే మనకు టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్ గా ప్యాట్ కమిన్స్ నిలుస్తాడు.
Read Also: IT Recruitment: ఐటీలో ఉద్యోగాల కల్పనలో దేశంలోనే టాప్ ప్లేస్ లో హైదరాబాద్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక, ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ హంగామా అంత హైదరాబాద్ నగరంలోనే కనిపిస్తుంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు రెడీ అవుతున్నాయి. పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్ థీమ్ అలంకరణతో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మన హైదరాబాద్ టీమ్ ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్ అభిమానుల్ని లైవ్ ఏర్పాట్లతో హోటల్స్, పబ్స్, లాంజ్ లు ఆహ్వానిస్తున్నాయి.
Read Also: Liquor Policy : ఢిల్లీ తర్వాత ఇప్పుడు కేరళలో మద్యం పాలసీపై వేడెక్కుతున్న రాజకీయాలు
కాగా, గచ్చిబౌలిలోని ముస్టాంగ్ టెర్రస్ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్ ఏర్పాటు చేసేశారు. కార్ఖానాలోని ద బార్ నెక్ట్స్ డోర్‌లో 2 బిగ్ స్క్రీన్స్, జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్ స్పోర్ట్స్ బార్ అండ్ బౌలింగ్ సెంటర్‌లో పెద్ద స్క్రీన్ తో పాటు చిన్నపాటి టీవీలను కూడా ఏర్పాటు చేయడంతో పూర్తిగా ఐపీఎల్ సందడికి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్ క్లబ్.. లాంటి సంపన్నులకు చెందిన క్లబ్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో క్రికెట్ అభిమానులను ఆహ్వానిస్తున్నాయి. కాగా, ఇప్పటికే మాల్స్, మల్టిఫ్లెక్స్‌లూ, కెఫెలు సైతం స్పెషల్ స్క్రీన్స్ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!