Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని 15 మ్యూజియంలకు తాజాగా బాంబు ఉన్నట్లు హెచ్చరికలు వచ్చినట్టు పోలీసులు ఇవాళ (బుధవారం) చెప్పుకొచ్చారు.
ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన పరిస్థితి ఏర్పాడింది. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడులపై భారత్ తొలిసారిగా తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం రష్యాలో జరిగిన సమావేశం తర్వాత బ్రిక్స్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పాలస్తీనాలో అధ్వాన్నమైన పరిస్థితి, ముఖ్యంగా గాజా స్ట్రిప్లో కొనసాగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు.. త్వరలో లోక్సభలో బీజేపీ బలం 237కి తగ్గుతుందని ఆయన తెలిపారు.
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు దిగుతున్నారు. జమ్మూ కశ్మీర్లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రమూకలు దాడి చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై మద్దతు ధరను నిర్ణయించే అంశాన్ని లేవనెత్తుతానని వెల్లడించారు. ఉత్తర మహారాష్ట్రలో ప్రధాన ఉత్పత్తి ఉల్లి.. వీటి కారణంగానే తాము సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశమే మమ్మల్ని బాగా ఏడిపించిందని సీఎం షిండే కామెంట్స్ చేశారు.
ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న కమలం పార్టీ గిరిజన నేతకు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. కియోంజర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోహన్ చరణ్ మాఝీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావాలి అని జనసేన చీఫ్ పవన్ పేర్కొన్నారు. కక్ష సాధింపునకు ఇది సమయం కాదు.. గతంలో అలా చేశారు కాబట్టి.. మనమూ అలాగే చేయాలని అనుకోవద్దు.. కక్ష సాధింపును నేను ఎంకరేజ్ చేయను అంటూ తెలిపారు. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా అవతరించాం.. దేశంలో ఎవ్వరికి లేని రికార్డు 100 శాతం స్ట్రైకింగ్ రేట్ మనకు వచ్చింది.
రాజ్ భవన్ లో ఎన్డీయే కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు గవర్నుకు లేఖ అందించారు.