ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకోబోతున్నారు.
నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది 72 మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల ఆహ్వానితులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు.
మణిపుర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్ పై ఇవాళ (సోమవారం) మెరుపు దాడి చేశారు. భద్రతా కాన్వాయ్ వాహనాలపై పలుమార్లు తుఫాకీతో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు.
ఈరోజు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో .. ఈ ఏడాది చివర్లో (మహారాష్ట్ర విధాన సభ ఎన్నికలు 2024) జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మన చేతుల్లోకి వస్తుందని శరద్ పవార్ పేర్కొన్నారు.
బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.
భారత దేశ ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. ఇక, పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మోడీ తొలి ఫైల్పై సంతకం చేసి.. కోట్లాది మంది రైతులకు అద్భుతమైన కానుక అందించారు. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాలకు పంపే ఫైలుపై మోడీ సంతకం చేశారు.