కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్దరణ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పెన్షన్ల పెంపుపై జీవో జారీ చేశారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో ఏపీలో పెన్షన్ల స్కీం చంద్రబాబు సర్కార్ అమలు చేయనుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే వరుస సమావేశాలు పెట్టి అభ్యర్థులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు. అయితే, నేడు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు అందాయి.
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున రహదారి నెత్తురోడింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ హస్పటల్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.
మేజర్లను తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనియ్యకుండా, ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ ఆపలేరని అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తోందని తెలిపింది.
నీట్-యూజీ2024 పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్2024 ఎలాంటి అవినీతి జరగలేదన్నారు.
ముంబయికి చెందిన యువ డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో తన సోదరితో కలిసి బుధవారం ఆన్లైన్ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ పెట్టారు. 2 అంగుళాల మనిషి వేలు కనిపించింది. దీంతో ఆమె స్వయంగా డాక్టర్ కావడంతో వెంటనే దానిని పరిశీలించింది.