విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటాను.. మంత్రిని బట్టి శాఖ పని తీరు ఉంటుందని అనేక మంది చెబుతున్నారు.. అందుకు తగ్గట్టే పౌర విమానయాన శాఖను డ్రైవ్ చేస్తాను అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఎన్డీయే కూటమికి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయం అని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామన్నారు.
విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష సైతం జరిగింది. ఇందులో శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఏ కన్వెన్షన్ హాల్ కు బీజేపీ ఎమ్మెల్యేలు, పురంధేశ్వరి బయలుదేరి వెళ్లారు.
మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరు కాబోతున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేసింది.