మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనరు (17) నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందిన కేసు దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. రక్త నమూనా మార్పిడికి పాల్పడిన డాక్టర్ వెనుక పెద్ద క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని వెల్లడైంది. తాజాగా, సదరు డాక్టర్ కు నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలోనే రూ.4 లక్షలు లంచం చెల్లించినట్లు తెలిపారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు తలదాచుకుంటూ అక్కడి నుంచి వారు తమ స్థానిక నెట్‌వర్క్‌ల ద్వారా బారాముల్లా, కుప్వారాతో సహా లోయలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు.
ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ దేవాలయంలో గల నాలుగు ద్వారాలు ఇవాళ తెరచుకున్నాయి. ఈ ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు.
కాంగోలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో 86 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. రాజధాని కిన్షాసాకు సమీపంలోని ఓ నదిలో పడవ బోల్తా పడిపోయినట్లు అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్డి తెలిపారు.
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. ఇటీవల మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకిది తొలి విదేశీ పర్యటన కాబోతుంది.
దేశ ప్రజలను ఉద్దేశించి సినీనటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు.. అధికంగా పని చేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలని తెలిపారు.